రుణం తీరలే..! రైతు బతుకు మారలే..! : కేటీఆర్
17-08-2024 11:06 AM
హైదరాబాద్: రుణం తీరలే..! రైతు బతుకు మారలే..! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో రుణమాఫీ లెక్క రూ.49,500 కోట్లు ఉండగా, కేబినెట్ భేటీలో మాత్రం రుణమాఫీ లెక్క రూ.31 వేల కోట్లు చూపించారని కేటీఆర్ ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి బడ్జెట్ లో రూ.26,000 కోట్లు కేటాయించిందని, రైతులకు మూడు విడతల్లో రూ.17,933 కోట్లు మాత్రం రుణమాఫీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే బెదిరింపులకు పాల్పాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెబుతామన్నారన్నారు. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామని కేటీఆర్ తెలిపారు.






