12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

కోల్ కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం.. రోడ్డెక్కిన వైద్యులు

17-08-2024 12:18 PM

కరీంనగర్, (విజయక్రాంతి): కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం ఘటనతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగతున్నాయి. వైద్యులు 24 గంటల పాటు విధుల బహిష్కారించి నిరసనలు చేపడుతున్నారు. కోల్ కత్తా ఘటనకు నిరసనగా డాక్టర్ల సమ్మెతో కరింనగర్ జిల్లాలోని వైద్యులంతా రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో దవాఖానాల్లో వైద్యసేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కేవలం అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సర్వీసులు మినహా మిగతా సేవలన్నింటినికి దూరంగా ఉండాలని డాక్టర్లు నిర్ణయించారు. ఉత్తర తెలంగాణాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే కేంద్రంగా పేరున్న కరీంనగర్ ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రులు బోసిపోయాయి. కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీరంతా కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.