calender_icon.png 22 November, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని ఆర్టీసీ బస్టాండ్‌లోని సమస్యలపైడిపో మేనేజర్‌కు వినతిపత్రం

17-08-2024 11:59:00 AM

మంథని, (విజయక్రాంతి): నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే మంథని బస్టాండ్ లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ కు మంథని పట్టణ వాసులు వినతి పత్రం అందజేశారు. మహాలక్ష్మి పథకం తర్వాత మంథని బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ చాలా పెరిగిందని, పోలీసులు ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆకతాయిలకు, పోకిరీలకు అడ్డాగా మారిందన్నారు.

మూత్ర విసర్జనశాల నుండి దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు బస్టాండ్ ఎదురుగా గల కాలీ స్థలంలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు. చిన్నపాటి వర్షానికి బస్టాండ్ చెరువులా కనిపిస్తుందని, బస్టాండ్ ఆవరణం పందులతో, పశువులతో నిండిపోతుందని చెెప్పారు. రాత్రి పూట బస్టాండ్ ఆవులకు అడ్డాగా మారిందన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో పెండ్రు సుమంత్ రెడ్డి, సోంపల్లి నారాయణ రావు, ముస్కుల  జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.