సెమీస్‌లో కిశోర్
24-08-2024 12:30 AM
మాల్దీవ్స్: ఆసియా సర్ఫింగ్ అండర్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడు అథ్లెట్ కిశోర్ కుమార్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన హీట్d క్వార్టర్ ఫైనల్లో కిశోర్ 11.50 పాయింట్లతో టాప్ స్కోరు సాధించాడు. చైనీస్ తైఫీకి చెందిన జాన్ చాన్ 8.76 పాయింట్లతో రెండో స్థానం, మాల్దీవ్స్‌కు చెందిన సయ్యిద్ సలాహుద్దీన్ 7.90 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో భారత్ నుంచి మొత్తం 8 మంది పాల్గొనగా చివరకు కిశోర్ మాత్రమే మిగిలాడు. శనివారం సెమీఫైనల్ జరగనుంది.




