5 July, 2026 | 5:57 PM

Breaking News

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి   •   పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి   •   ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి   •   మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం   •   బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి   •   రామేశ్వరం ఆర్టీసీ బస్సు   •   జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి   •   పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం   •   ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం   •  

బాలుడిపై కుక్క దాడి

01-05-2025 01:20 AM

హుజురాబాద్, ఏప్రిల్30: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బుధవారం ఉదయం బాలుడు పై వీధి కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామంచ.

అయాన్ అనే రెండు సంవత్సరాల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీదికుక్క ఒక్క సారిగా  దాడి చేయగా బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు  బాలుడిని వెంటనే హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. గ్రామ ఫరిధిలో ఇటీవల కూడా ఇద్దరు పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడం జరిగిందని. అధికారులు  వీధి కుక్కల సమస్య కి పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.