calender_icon.png 1 May, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూదాన్ భూముల అక్రమాలపై విచారణ జరిపించాలి

01-05-2025 01:18:46 AM

ఆల్ ఇండియా సర్వ సేవా సంగ్ మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి

ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : భూదాన్ యజ్ఞ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారణ జరిపించాలని ఆల్ ఇండి యా సర్వ సేవా సంగ్ మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. భూదాన్ భూములను స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆయ న కోరారు.

భూదాన్ యజ్ఞ బోర్డును వెంట నే పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండి యా సర్వోదయమండలి జాతీయ అధ్యక్షుడు వెదిరే అరవింద రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు తొలుపులూరి కృష్ణ గౌడ్, వేదిరే ప్రమోతిస్ చంద్రారెడ్డి, డా.వేదిరే ప్రమోద్ చంద్రారెడ్డిలతో కలిసి మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో భూదాన్ భూముల అన్యా క్రాంతంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించిందని ప్రస్తుత ప్రభుత్వం ఈ విచారణ వివరాలను వెల్లడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గున్న రాజేందర్ రెడ్డికి భూదాన్ యజ్ఞ బోర్డుతో వేదిరే రామచంద్రారెడ్డి కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూదాన్ యజ్ఞ బోర్డు లేకపోవడం వలనే అనేక అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూదాన్ యజ్ఞ బోర్డును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో భూదాన్ భూము లు లక్ష ఎకరాల వరకు ఉన్నాయని వాటిలో అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతు కూలీలు, దళితులు, నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. గాంధీభవన్‌లో ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయాన్ని తెరిచి కొంతమంది దానిలో తిష్ట వేసి భూదాన్ భూములు ఇస్తామని పేదల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారిని గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరూ డబ్బులు చెల్లించవద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో భూదాన్ ఉద్యమంలో భూ దాన్ భూములు పొందిన కుటుంబాలకు చెందిన వారు శ్రీమంత్ గిరి, నరేష్, రాజు, కొమ్ము లక్ష్మణ్, కే.దానయ్య పాల్గొన్నారు.