విద్యార్థినులపై కుక్క దాడి
10-12-2024 12:26 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9(విజయక్రాంతి): కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో డిగ్రీ విద్యార్థినులపై సోమవారం కుక్క దాడి చేసింది. కాలేజీ ఆవరణలో ఉండగా అకస్మాత్తుగా వారిపై కుక్కదాడి చేయగా ఇద్దరు గాయపడ్డారు. వారిని సహచర విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. యూనివర్సిటీలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా అధికారులు పట్టిం చుకోవడం లేదని అన్నారు. వర్సిటీ ఉన్నతాధికారులు స్పం దించి సమస్య పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.






