చర్లపల్లి జైలుకు నరేందర్‌రెడ్డి
10-12-2024 12:28 AM
వికారాబాద్, డిసెంబన్ 9 (విజయక్రాంతి): లగచర్ల ఘటనలో ఏణూ ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు. అక్కడినుంచి పోలీసు వాహనంలో చర్లపల్లి జైలుకు తరలించారు.






