13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

డాన్ బాస్కో ముగించారు

29-03-2026 12:00 AM

రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ ఉప్పుటూరి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’. పీ శంకర్ గౌరి రచన, దర్శకత్వం వహిస్తున్నా రు. రుష్య దత్త కథానాయకుడిగా నటిస్తు న్న ఈ చిత్రంలో మిర్నా మీనన్ లెక్చరర్ సుమతి పాత్రలో, మురళీశర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో కనిపించనున్నారు. మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సిని మా షూటింగ్ పూర్తి చేసుకంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో రుష్య దత్త చాలా స్టైలిష్‌గా, బోల్డ్ పోజ్‌లో కనిపిస్తున్నారు. ‘ప్రతి రీయూనియన్ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి కోసం కూడా ఉంటాయి’ అంటూ ఈ పోస్టర్‌కు జోడించిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ చిత్రానికి సం గీతం: శ్రీచరణ్ పాకాల; సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు; ఎడిటర్: వంశీ అట్లూరి.