13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మహాకాళి సెట్స్‌లో శుక్రాచార్యుడు!

29-03-2026 12:00 AM

భూమి శెట్టి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మహాకాళి’. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తూ, టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

శనివారం అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీ సెట్స్ నుంచి ఒక కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. చిత్రబృందం 100 రోజుల షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయగా, చివరి 40 రోజుల షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

శుక్రాచార్యుడి పాత్ర కోసం అక్షయ్ ఖన్నా తన చిత్రీకరణను పూర్తి చేశారు. మరోవైపు వీఎఫ్‌ఎక్స్ పనులు శర వేగంతో సాగుతున్నాయి. నిర్మాతలు త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.  ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం సమకూర్చుతుండగా, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగలా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.