calender_icon.png 7 February, 2026 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు డబ్బులు విరాళం

07-02-2026 12:00:00 AM

తాడ్వాయి, ఫిబ్రవరి, 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాలోజివాడి గ్రామంలో శుక్రవారం ఓ మహిళ మృతి చెందడంతో ఆమె అంత్యక్రియలకు స్థానిక సర్పంచ్ బద్దం చంద్రారెడ్డి రూ. 5 వేలు విరాళంగా అందించారు. తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు అంత్యక్రియలు విరాళం అందించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామానికి చెందిన చాకలి నరసవ్వ మృతి చెందారు. ఆమె అంత్యక్రియల కోసం సర్పంచ్ ఈ విరాళం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.