5 July, 2026 | 2:27 AM

రాజన్న ఆలయ అభివృద్ధికి విరాళం

05-07-2026 12:00 AM

రూ.1.41 లక్షలు అందజేసిన కిరణ్‌కుమార్ లక్ష్మి లావణ్యలు

వేములవాడ, జూలై 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం అమెరికాలో స్థిరపడిన వరంగల్ వాస్తవ్యులు జాట్లింగ్ కిరణ్ కుమార్‌లక్ష్మి లావణ్య దంపతులు రూ. లక్షా 41వేలు విరాళాన్ని అందజేశారు.

శనివారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ఈఓ రమాదేవికి నగదును అందించారు. ఆలయ అధికారులు దంపతులను శేషవస్త్రం,వేద ఆశీర్వచనం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.