‘వినాయక హిల్స్’ సమస్యల పరిష్కారానికి కృషి
05-07-2026 12:00 AM
బడంగ్ పేట్, జూలై 4 (విజయక్రాంతి) : నాదర్గుల్ డివిజన్ పరిధిలోని వినాయక హిల్స్ ఫేజ్2, రోడ్ నెం.5లో డ్రైనేజీ పొంగి పొర్లుతూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న బోయపల్లి రాఘవేందర్ రెడ్డి వెంటనే స్పం దించారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు వెంట నే ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైనేజీ లైన్ను శుభ్రపరిచి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వినోద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.






