ఆలయ భూమిలో ఆక్రమణ తొలగింపు
రేకుల షెడ్డును కూలగొట్టిన దేవస్థానం ల్యాండ్ ప్రొటెక్షన్ టీమ్
వేములవాడ, జూలై 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయం పరిధిలో దేవస్థానం భూమిని ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్డును శనివారం దేవస్థానం ల్యాండ్ ప్రొటెక్షన్ టీమ్ తొలగించింది. సులభ్ కాంప్లెక్స్ సమీపంలో ఆక్రమణ చేసి దుకాణం నిర్వహించడం వల్ల భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఖాళీ చేయకపోవడం తో చట్టపరమైన విధానంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.
దేవస్థానం భూముల పై ఎలాంటి ఆక్రమణలనూ సహించబోమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.అలాగే దేవస్థానం లేదా ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






