ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నేమ్ బోర్డు విరాళం
25-07-2026 09:29 PM
మల్దకల్: గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థి, అరగిద్ద గ్రామ సర్పంచ్ బాలకృష్ణ పెయింటింగ్‌తో కూడిన కళాశాల నేమ్ బోర్డును విరాళంగా అందజేశారు. బాలకృష్ణ 2006–08 బైపీసీ బ్యాచ్‌లో ఈ కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీలత శాలువాతో బాలకృష్ణను సత్కరించి, కళాశాల అభివృద్ధికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. మాతృ విద్యాసంస్థ పట్ల ఆయన చూపిన సేవాభావం ఇతర పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.






