శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు
25-07-2026 09:33 PM
పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ భూనీలా సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు అర్చకులు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎ. రాధాకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.






