28 June, 2026 | 2:24 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

21-06-2025 05:52 PM

ప్రధానోపాధ్యాయులు ఉల్లెందుల సైదులు..

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతలుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు ఉల్లెందుల సైదులు కోరారు. శనివారం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో చీదెళ్ల గ్రామ వాస్తవ్యులు పొదిల్ల నాగేశ్వర్ రావు-మాధవీలత దంపతుల కూతురు చిరంజీవి లోహిత జన్మదినం సందర్భంగా పాఠశాలలో చదివే 26 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హెచ్ఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం దాతలను సన్మానించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సృజన,అంగన్వాడీ టీచర్ శివరంజని,రిటైర్డ్ లెక్చరర్ దూదిగామ గోపాల్,పద్మ,యశోద తదితరులు పాల్గొన్నారు.