calender_icon.png 21 June, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా సాధనతో ఆరోగ్యం

21-06-2025 05:54:03 PM

దౌల్తాబాద్: యోగ సాధనతోనే ఆరోగ్యం సాధ్యమవుతుందని మండల విద్యాధికారి కనకరాజు(Mandal Education Officer Kanaka Raju) అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్, గాజులపల్లి, తిరుమలాపూర్ పాఠశాలలో యోగా డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..