గ్రామస్తులకు తప్ప ఎవరికీ భయపడొద్దు
మాజీ ఎమ్మెల్యే
నల్లమడుగు సురేందర్
నూతన సర్పంచ్‌లకు
సన్మానం
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రాంప్రతాప్ థియేటర్‌లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను, ఉప సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ మాట్లాడుతూ పదవి చిన్నదైన పెద్దదైన ఏమీలేదు. ఎంపీ, ఎమ్మె ల్యే అయినా వార్డ్‌మెంబర్, సర్పంచి అయిన ఆ గ్రామ పరిధిలో ఉన్న ప్రజలు మంచి వ్యక్తి కాబట్టి ఎన్నుకున్నారు.కనుక మంచి పనులు చేయాలని తెలిపారు.బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని సురేందర్ తెలిపారు. ఎవరి భయపడవలసిన అవసరం లేదని ఎవరి హక్కులు వారికే ఉంటాయన్నారు. మీ గ్రామానికి భయపడాలి మీ గ్రామ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఇద్దరికే చెక్ పవర్ ఉంటుంది. ఒకటి రాష్ట్రపతికి ఇంకోటి సర్పంచ్‌కి మాత్రమే అని అన్నారు. గ్రామ అభివృ ద్ధికి నిధులు వస్తాయి.ఏవార్డులో ఎక్కడెక్కడ నిధులు పెట్టుకోవాలో గ్రామ ప్రజలు మీకు అవకాశాన్ని ఇచ్చారన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ బలపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల బీఆర్ ఎస్ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పీటీసీ ఉమన్నగారి మనోహర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి ,సీనియర్ నాయకులు రాజిరెడ్డి, మురళి, దుందిగల్ నర్సిం లు, దేశబోయిన సాయిలు, దుర్గారెడ్డి, సాయిబాబా, మిద్దెబాబు, మంగ లి యాదగిరి, పుప్పాల నారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






