14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

కరోనా భయం వద్దు

27-05-2025 01:12 AM

కొవిడ్, సీజనల్ వ్యాధులపై సమీక్షలో మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): విదేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని, కరోనా గురించి భయప డాల్సిన పనిలేదని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. హె ర్డ్ ఇమ్యూనిటీ ఉన్నందున కొవిడ్‌పై భయం అవసరం లేదన్నారు.

దేశంలో కొవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి సోమవారం సచివాలయంలో సంబంధిత నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నంబికూరి సహా ఇతర నిపుణులంతా దేశ, విదేశాల్లో ఉన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. 

కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి...

కొవిడ్‌పై ప్రస్తుతానికి ఎలాంటి భయం లేకున్నా నిరంతరం నిఘా కొనసాగించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. 

సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్, డాక్టర్ అభిషేక్ అరోరా, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ, ఐసీఎంఆర్ ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ సుదీప్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.