18-08-2025 02:21:56 AM
వనపర్తి టౌన్, ఆగస్టు 17 : దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోష కోరారు. ఆదివారం వనపర్తి ఏఐటియుసి ఆఫీసులో జిల్లా స్వీపర్ల సమావేశంలో మాట్లాడారు. దళారుల పైరవీలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ఉద్యోగాలను పర్మెంటు చేస్తామని కొందరు ఒక్కొక్క స్వీపర్ దగ్గర రూ. 5200 వసూలు చేశారన్నారు.
మోసగాళ్లపై పోలీసులకు ఫి ర్యాదు చేయాలన్నారు. యూనియన్ పోరాటంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 12 నెలల పెండింగ్ వేతనం పొందగలిగామన్నారు. కొందరు స్వీపర్ల నెల జీతం రూ. 1623, మరికొందరికి రూ. 4000 ఉండేదని యూనియన్ పోరాటంతో ప్రభుత్వం రూ. 5200 కు పెంచిం దన్నారు.ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, భాస్కర్,సిపిఐపట్టణ కార్యదర్శి రమేష్, లక్ష్మీనారాయణ, స్వీపర్లు పాల్గొన్నారు.