calender_icon.png 18 August, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

18-08-2025 02:23:16 AM

చెరువులను ప్రత్యేకంగా పరిశీలించిన ఎస్పీ డి జానకి 

హన్వాడ ఆగస్టు 17 : వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై చెరువుల దగ్గర పక్కాగా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి స్పష్టం చేశారు. ఆదివారం హన్వాడ మండల కేంద్రంలోని చెరువుతో పాటు బోయపల్లి టంకర, చిన్నదర్పల్లి లలోని ప్రత్యేకంగా పరిశీలించడంతోపాటు వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా,

భద్రతా పరంగా జరగుటకు జిల్లా పోలీస్ విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు అందుబాటులో ఉండే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ గాంధీ నాయక్, హన్వాడ ఎస్త్స్ర వెంకటేష్ తదితరులు ఉన్నారు.