calender_icon.png 18 August, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న ఓయూకు సీఎం రేవంత్‌రెడ్డి?

18-08-2025 02:12:45 AM

  1. పలు భవనాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
  2. సీఎంను ఆహ్వానించిన ఓయూ వీసీ, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ 
  3.    20 ఏళ్ల తర్వాత యూనివర్సిటీకి సీఎం

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం కోరారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి ఈ నెల 21న ఓయూలో జరిగే కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలికారు.

రూ.80 కోట్ల వ్యయం తో నిర్మాణమై, 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్‌ను ప్రారం భం, గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చేతులమీదుగా జరుగనున్నది. ఇదే కార్యక్రమంలో దాదాపు రూ.10 కోట్ల నిధులతో డి జిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులను కూడా సీఎం ప్రారంభించనున్నారు.

అదే రోజు ఓ యూలో ఉన్న టాగూర్ ఆడిటోరియంలో వె య్యి మంది ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉద్దేశించి “ తెలంగాణ విద్యా రంగంలో రావా ల్సిన మార్పులు ప్రభుత్వ ప్రణాళిక” అనే విషయం మీద సీఎం ప్రసంగించనున్నారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌తో పాటు విదేశాల్లో చదువుకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయా న్ని అందించే పథకాన్ని సీఎం ప్రారంభిస్తార ని వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మం త్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్ పాల్గొంటారు. కాగా గత 20 ఏళ్లలో ఓయూలోకి ముఖ్యమంత్రి హో దాలో వచ్చి ప్రసంగించనున్న తొలి సీ ఎం రేవంత్‌రెడ్డినేనని ఓయూ వీసీ కుమార్ తెలిపారు.