18-08-2025 02:19:39 AM
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్‌ను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆర్టీసీ బస్సును వాడినట్టు వాడుతున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్‌ను ఏ హోదాలో రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీహార్ ఎన్నికల్లో వాడుతున్నారని ప్రశ్నిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోను తన ఎక్స్ ఖాతాలో ఆదివారం పోస్టు చేశారు.
రాజ్యాంగ పుస్తకాన్ని ఎప్పుడూ చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీకి ఇది చట్ట విరుద్ధం అని తెల్వదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచి దేశమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పంచి పెడుతున్నారని మండిపడ్డారు.