calender_icon.png 18 August, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్డీయేకు అనుబంధ విభాగంలా ఈసీ

18-08-2025 02:17:06 AM

  1. ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాలి
  2. ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సాకులే కనిపించాయి
  3. మాజీ మంత్రి కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడా ల్సిన కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి అనుబంధ విభాగంలా పనిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సం ఘానికి సమగ్ర ప్రక్షాళన అవసరమని కేటీఆర్ అన్నారు. ఆదివారం ఈసీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సమాధానాల కంటే అనేక ప్రశ్నలను ప్రజల్లో లేవనెత్తిందంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో పాటు ఎన్నికల సంఘానికే సమగ్ర ప్రక్షాళన అవసరమని అన్నారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయని, ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇచ్చిన వివరణలో సమస్యల పరిష్కారాల కన్నా సాకులుగా ఎక్కువగా కనిపిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు.

ఓటర్ల జాబితాలో లోపాలను ఈసీఐ అంగీకరించినప్పుడు, తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, కేవలం ఓటర్ల జాబితాను సవరించడం కాకుండా, ఈసీఐ నియామక ప్రక్రియనే సమూలంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈసీఐ స్వయం ప్రతిపత్తిపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, కేటీఆర్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.