calender_icon.png 18 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి మున్సిపాలిటీ అస్తవ్యస్తం!

18-08-2025 02:32:36 AM

  1. ముసురు వర్షాలతో చిత్తడి చిత్తడి... 
  2. పేరుకుపోయిన పారిశుద్ధ్యం 
  3. పని దొంగలకు నెలనెలా జీతాలు..
  4. ఇతరులపై పెరుగుతున్న పని భారం 
  5. పట్టించుకోని అధికారులు, పాలకులు

 నాగర్ కర్నూల్ ఆగస్టు 17 (విజయక్రాంతి)/ కల్వకుర్తి : నాగర్ కర్నూలు జిల్లా క ల్వకుర్తి మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారయింది. గత వారం రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు పట్టణమంతా చిత్తడి చి త్తడిగా మారి ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపో యి కనిపిస్తోంది. ప్రజలు కట్టే పన్నుల ఆధారంగా నెల నెలా జీతాలు తీసుకునే ఉద్యో గులు కార్యాలయాలకు కూడా రాకుండా డు మ్మా కొడుతున్నారు అయినా నెల జీతాలు మాత్రం టన్చ్చన్ గా పొందుతున్నారు.

అ యినా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఇటు పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో సామాన్య ప్రజలు అల్లాడిపో తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా సొంత ప్రాంతం ఆయన కల్వకుర్తిలోనే ఉద్యోగులు డుమ్మాకొట్టి నెల జీతాలు పొందుతు న్నారని కల్వకుర్తి పట్టణవాసులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారు ల ఇళ్లల్లో పాచి పని చేసుకోవడానికి డిప్యూటేషన్ పై కొంతమంది చిన్న ఉద్యోగులను బానిసలుగా పని చేయించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పట్టణంలో సె ట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా సంబంధిత అధికా రులు వారి నుండి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేస్తున్నారు తప్ప వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కుంటలు నాళాలు ఆక్రమణ జరి గి వర్షపు నీరంతా రోడ్లపైనే కాలనీలోనే తిష్ట వేస్తున్నాయని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.

పట్టణంలోని కొన్ని విలాస వంతమైన భవనాలకు కనీసం అనుమతులు లేకుండానే కమర్షియల్ బిల్డింగ్ నడుపుతున్నారని విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులకు తెలిసినా వారి నుండి ముడుపులందుకొని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కల్వకుర్తి పట్టణంలోని పలు వార్డులకు ఆఫీసర్గా పని చేయాల్సిన ఓ వీఆర్‌ఏ తన రాజకీయ పలుకుబడితో జిల్లాలోని ఓ ప్రజా ప్రతినిధి వెంట తిరుగుతూ విధులకు డుమ్మా కొడుతున్నారని విమర్శలు ఉన్నా యి. అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఓ సాధారణ మహిళకు కల్వకుర్తి పట్టణంలో శానిటేషన్ విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధుల్లోకి తీసుకొని జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి ఇంట్లో పాచిపని చేస్తోందని పట్టణంలో ప్రచారం జరుగుతుంది.

ప్రస్తు తం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి గతేడాది మున్సిపల్ కమిషనరేట్కు సరెండర్ కు గురయ్యాడు. అయినా యధావిధిగా కల్వకుర్తి మున్సిపాలిటీలోనే పనిచే యడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జనావాసాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో చెత్త చెదారం పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెంది కుక్క లు, పందులు స్త్వ్రర విహారం చేస్తూ సామాన్యులపై వ్యాధులు దండెత్తుతున్నాయని అయినా మున్సిపల్ అధికారులకు ఏమా త్రం పట్టింపు లేదా అని ప్రజలు మండిపడుతున్నారు.

కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉద్యోగులంతా తరచూ దుమ్మాలు కొడుతున్న విషయాలు స్థానిక ప్రజాప్రతినిధుల కు తెలిసినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సొంత ప్రాంతంలోనే అధికారులు ఇంత అలసత్వంగా పనిచేస్తే ఇక రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందా అని ప్రజ లు చర్చించుకుంటున్నారు. ఈ విషయాలపై కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.