10-11-2025 12:00:00 AM
-మండల మహామాలు సత్తా చాటేలా రణభేరి మహాసభ
-మండల మాల మహానాడు సంఘం నాయకులు
మణుగూరు, నవంబర్ 10 (విజయక్రాం తి ) : ఎస్సీ వర్గీకరణతో మాలలకు జరి గిన అన్యాయంపై పోరాడేందుకు నవంబ ర్ 23 న హైదరాబాద్ లో జరిగే మాల రణ భేరి మహాసభను విజయవంతం చేయా లని, మండల మాల మహానాడు అధ్యక్షు లు వేర్పుల నరేష్, ప్రధాన కార్యదర్శి బూ ర్గుల సతీష్, గౌరవాధ్యక్షులు మద్దెల భద్ర య్య పిలుపునిచ్చారు. ఆదివారం సం ఘం కార్యాలయంలో వారు రణభేరి మ హాసభ గోడపత్రిక, కరప త్రాలను ఆవిష్క రించి మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ సర్కారు మాలలకు తీరని అన్యా యం చేసిందని మండిపడ్డారు. రోస్టర్ పా యింట్ల కేటాయింపులో మాలలకు ఒక్క శాతమే కేటాయించారని, ఫలితంగా వి ద్యా, ఉద్యోగాలలో మాల విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో చేసిన ఎస్సీ వర్గీకరణ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా జన గణన చేపట్టకుండానే మాలలకు 5శాతం, మాదిగలకు 9శాతం రిజర్వేషన్ ఇచ్చి రో స్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీ వ్రంగా నష్టపోతున్నారన్నారు. రోస్టర్ పా యింట్లను సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేద ని ఆరోపించారు.
రోస్టర్ పాయింట్ల కేటా యింపును పునఃసమీక్షించి జీఓ 99ని సవరించి మాలలతో పాటు గ్రూప్-3 లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చే యాలన్నారు. మరోవైపు ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్లు, సబ్ప్లాన్, ఎస్సీ కార్పొ రే షన్ నిధులు పెండింగ్ పెట్టారని విమర్శిం చారు. మాలలకు జరిగిన అన్యాయం పై ప్రశ్నించేందుకు ప్రతి ఒక్క మాల కుటుం బం రణభేరి మహాసభకు తరలి రావాల ని, అన్ని రాజకీయ పార్టీలకు మాలల సత్తా చూపెట్టాలన్నారు. సమావేశంలో నాయకులు వేర్పుల సురేష్,బూర్గుల సం జీవరావు, నరేష్ , యేసురత్నం ప్రసాద్ బాబు,తోట ప్రసాద్, శంకర్ పాల్గొన్నారు.