మీర్‌పేట్ మేయర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
మహేశ్వరం, మే 21 (విజయక్రాంతి): మీర్‌పేట్ మేయర్ దుర్గ భర్త దీప్‌లాల్ చౌహన్ అనధికరికంగా షాడో మేయర్‌గా వ్యవహరి స్తున్నారని, మున్సిపల్ సిబ్బందిపై పెత్తనం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కే శశాంకకు ఫిర్యాదు చేశారు. మేయర్ కార్యాలయానికి వివిధ సమస్యలతో వచ్చే సామాన్య జనం గోడు వినిపించుకోవడం లేదని, ఈ విషయాన్ని మేయర్ దృష్టికి తీసుకెళ్తే అంత మా భర్తనే చూసుకుంటాడని మేయర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రజా సమస్యలు పట్టించుకోకపోగా.. మున్సిపల్ సిబ్బంది,మహిళా కార్పొరేటర్లపై అనుచిత వాక్యలు చేయడం బాధాకరమన్నా రు. వెంటనే కలెక్టర్ స్పందించి మేయర్ దుర్గ, ఆమె భర్త దీప్‌లాల్ చౌహన్ వ్యవహారంపై ఆరా తీయాలని,ప్రజలకు మేలు జరిగేలా చర్య లు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో కార్పొరేటర్ ఎన్.రవి నాయక్ బృందం ఫిర్యాదు చేశారు.






