24-05-2025 12:00:00 AM
-రాహుల్ మాటలు దేశ సమగ్రతకు విఘాతం
- బస్తీల అభివృద్ధికి నిధులివ్వని రాష్ట్రం
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, మే 23: దేశ రక్షణకు పాటుపడుతున్న భారత సైనికులకు రాజకీయాలు అంటగట్టొద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి సూచించారు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ గురించి గతంలో కేసీఆర్, కవితలు అవాకులు, చవాకులు మాట్లాడరని, ప్రస్తు తం ఆపరేషన్ సిందూర్ గురించి ఎన్ని విమానాలు కోల్పోయారంటూ రాహుల్‌గాంధీ ప్రశ్నించడం దేశ సైనికశక్తి స్థైర్యాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా సైనికులు చేపట్టిన చర్యలతో పాక్ సిగ్గుతో అంతర్జాతీయంగా తలదించుకుందన్నారు. పాక్‌లోని ఉగ్రవాదులను మట్టిలో కలిపితే వారిని అభినందిం చాల్సిన పోయి విమానాలు ఎన్నికూలిపోయాయి, ఎంతమంది చనిపోయారు? అం టూ పాక్ మాట్లాడిన మాటలను కాంగ్రెస్ మాట్లాడుతుందన్నారు. శుక్రవారం హిమాయత్‌నగర్ భగ్గీఖాన్ బస్తీలో అదనపు కమ్యూనిటీ హాల్ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ ద్వారా నిధులు అందడం లేదని ఆరోపించారు. బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్ల పనుల్లో జాప్యం నెలకొందన్నారు. ఎన్నోమార్లు అధికారులతో మాట్లాడినా వీధి లైట్లను ఎందుకు మార్చలేకపోతున్నారని నిలదీశారు. అభివృద్ధి పనులను చేస్తున్న కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని సూచించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహిస్తున్నారే తప్పా పాతబస్తీలో పేరుకుపోయిన సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, హిమాయత్ నగర్ డివిజన్ అధ్యక్షురాలు జి మాధవి ఉన్నారు.