calender_icon.png 24 May, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యం...

23-05-2025 11:30:36 PM

ప్రభుత్వ డ్రైవర్లీ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జహంగీర్ అలీ

హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమమే తన లక్ష్యం అని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జహంగీర్ అలీ అన్నారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని అపోసియేషన్ కార్యాలయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి. సాబీర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్య డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా పని చేసిన సర్దార్ మంజిత్  సింగ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా పని చేసిన సయ్యద్ హసమ్ వాస్సేని సంఘానికి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసినందున వీరిని సంఘం నుంచి తొలగించినట్లు జహంగీర్ అలీ  తెలిపారు.

వరంగల్ ఉమ్మడి జిల్లా  ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి సంబంధం లేని కొందరు వ్యక్తులు సభ్యత్వ రుసుం పేరుతో డబ్బులు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లాకు చెందిన గోపాల్ అనే వ్యక్తి వసూలు చేస్తున్న సభ్యత్వ రుసుంతో తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న  డ్రైవర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు  వాహనాలను  కొనుగోలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ డ్రైవర్ల సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. ప్రకాష్, ఉపాధ్యక్షుడు భాస్కర్, కోశాధికారి ఎండి  ఇబ్రహీం, జిల్లా నాయకులు మహమ్మద్ వలి పాషా, పోరిక పూల్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, ఉదారి కృష్ణ మూర్తి తదతరులు పాల్గొన్నారు.