18 April, 2026 | 1:05 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు

31-05-2025 01:26 AM

పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎంపీ బలరాం నాయక్ 

మహబూబాబాద్, మే 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ రైల్వే అధికారులకు కోరారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఎంపీ పరిశీలించారు.

స్టేషన్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన వివిధ పనుల జాప్యం వల్ల ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఎంపీకి వివరించారు. ఈ విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో ఎంపీ ఫోన్లో మాట్లాడి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.