23 June, 2026 | 11:42 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

గురుపూజోత్సవానికి వెళ్లే తీరిక లేదా?

06-09-2024 03:20 AM

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే  తీరిక లేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గురువారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ విద్యాశాఖ పట్ల మీ చిత్తశుద్ధికి, ప్రాధాన్యతకు ఇది మరో నిదర్శనమని విమర్శించారు. 9 నెలల మీ పాలనలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని, టీచర్లు లేక పాఠశాలలు మూసేస్తున్నారని పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లతో రోదిస్తున్నారని, గురుకులాల ఖ్యాతిని రోజు రోజుకు దిగజార్చుతున్నారని విమర్శించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యా యులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని, తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం దురదృష్టకరమన్నారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రని, ఉన్న విద్యా వ్యవస్థను సక్రమంగా నిర్వహించరు కానీ  సమీ కృత గురుకులాలు, విద్యా కమిషన్ అంటూ భ్రమలు  కల్పిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ నాయకత్వంలో పతనమవుతున్న విద్యా వ్యవస్థ గురించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.