calender_icon.png 24 February, 2026 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారిని రోడ్డున పడేయొద్దు!

24-02-2026 01:41:22 AM

  1. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో కుటుంబాల తరలింపు అన్యాయం
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ఎన్నో ఏండ్లుగా నివాస ముంటున్న మధ్యతరగతి కుంటుంబాలను రోడ్డున పడేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు డిమాండ్ చేశా రు. హైడ్రా పేరుతో ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యాయన్నారు. ఇప్పుడు తాజాగా ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ పేరుతో సుమారు ఆయా ప్రాంతాల్లోని 450 మంది మధ్యతరగతి కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయించి, తరలించేందుకు ప్ర యత్నిస్తోందని ఆరోపించారు.

ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చే శారు. అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలను అంధాకారంలోకి నెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదని పేర్కొన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా, ఎంత ప్రతిష్టాత్మకమైనదైనా చట్టబద్ధమైన విధానాలు, గౌరవప్రద మైన పునరావాసం, పూర్తి పారదర్శకత తప్పనిసరిగా కల్పించాలని కోరారు. భద్రత లే కుండా, బలవంతంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించడం మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి న్యాయం, పారదర్శకత, సముచిత పునరావాసం కల్పించాలని ఆయ న డిమాండ్ చేశారు.