15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నిందితులను కఠినంగా శిక్షించాలి

24-02-2026 01:41 AM

ముకరంపుర, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ లోని కుమ్మర మల్లన్న జాతరకు వెళితే మీరు గుడి లోపటికి రావద్దు అంటూ రజక కులానికి చెందిన భార్యాభర్తలను అగ్రకుల రెడ్డి సామాజిక చెందిన నాయకులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా రెండు నెలల పసికందును కాళ్లతో తొక్కి చంపేశారని, ఈ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు.

ఈ మేరకు సోమవారం సీపీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాదాసు సంజీవ్, జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.