calender_icon.png 15 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు ఆరోపణలు చేయొద్దు..

15-09-2025 12:11:37 AM

 డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి హెచ్చరిక 

నిజామాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : ఎంపీ అరవింద్ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అబ్బ తప్పు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బోధనలో ఎమ్మెల్యే అరెస్ట్ చేసిన ఉగ్రవాది అక్కడ కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి దానికి ముడి వేయడం సరికాదని ఆయన అన్నారు.

ఎంపీ అరవింద్ కు మతిభ్రమించిందని మొదటిసారి గెలిచిన అరవిందు పిచ్చి మాటలు చెప్తున్నారని రెండోసారి గెలిచిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్నాడని అనుకుంటే అప్పుడప్పుడు వాతావరణం మార్పు చెందినప్పుడు పిచ్చికూతలు కోస్తూ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీకి ముస్లింలకు ఎంఐఎంకు ముడి వేయడం ఎంపీ అరవింద్ అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు. దాడులు జరిపే సాంప్రదాయం తమది కాదని దాడులు జరిగి ఉంటే ఈపాటికి బిజెపి నాయకులపై ఆడులు జరిగేవని దాడులు జరపడం కాంగ్రెస్ పని కాదన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఇద్దరి సీత గానితనం వల్లే రాష్ట్రానికి ఏరియా రావడం లేదని యూరియా నువ్వు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ పంపి తెలంగాణకు తక్కువ పంపుతున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు.

యూరియా విషయమై ఓటు వేస్తామని డిమాండ్ ఎవరు చేయలేదని తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన అన్నారు. యూరియా విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని వాస్తవాలకు భిన్నంగా మాట్లాడడం అరవింద్ మానుకోవాలని మోహన్ రెడ్డి తో పలికారు మతపరమైన విభేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎంపీ అరవింద్ తన మార్చుకోవాలని లేదా గ్రామాల్లో బిజెపి నాయకులను ప్రజలు తరిమి కొడతారని మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మల్లేష్ దామోదర్ గౌడ్ నరేందర్ బీసీ మండల్ ప్రెసిడెంట్ రమణ కిషన్ రవి భగవాన్దాస్ మహేందర్ రమేష్ మల్లయ్య ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజేశ్వర్ జేమ్స్ గంగారెడ్డి రాజేందర్ కిరణ్ గౌడ్ జంగన్న రమేష్ మైలారం గంగారెడ్డి జగన్ మైపాల్ యూత్ కాంగ్రెస్ సతీష్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.