15-09-2025 12:11:35 AM
కొత్తపల్లి, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు కె.లక్షిత్, ఎ.వికాస్ తమ శాస్త్రీయ వినూత్న ఆవిష్కరణలకుగాను నేషనల్ స్పా ర్క్ ఇన్నోవేషన్ అవార్డు-2025 పొందారని ప్రధానోపాద్యాయులు గోపి కృష్ణ తెలిపారు.
వీరు గైడ్ టీచర్ లలిత్ మోహన్ సా హుతో కలిసి 2025 ఈనెల 12న హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మా లిక్యులర్ బయాలజీ (సిసిఎమ్ బి) లోని పి. ఎం.భార్గవ ఆడిటోరియంలో డాక్టర్ కె.వి. రావు సైంటిఫిక్ సొసైటీ నిర్వహించిన వార్షిక అవార్డు కార్యక్రమంలో కె. లక్షిత్, ఎ.వికాస్ లను 10 వేల రూపాయల నగదు బహుమ తి, ప్రసంసా పత్రాలు, అవార్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా పారమిత పాఠశాల ల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాద రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రష్మిత, వి యు యం ప్రసాద్, వినోద్ రావు, హనుమంత రావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, కోఆర్డి నేటర్లు రబీంద్ర పాత్రో , నాగరాజు గైడ్ టీచర్ లలిత్ మోహన్ సాహు, ఉపాద్యాయులుఅభినందించారు.