15 June, 2026 | 3:06 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

13-02-2026 01:06 AM

బెజ్జూర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మండలంలోని పాపణపేట్, తలయి, సోమిని గ్రామాల్లో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పర్యటించారు. గ్రామ నర్సరీలను పరిశీలించి ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక, సూపర్ ఫాస్ఫేట్ను తగిన మోతాదులో కలిపి బ్యాగ్ ఫిల్లింగ్ చేయాలని సూచించారు. ఎర్రమట్టిని జల్లెడ పట్టి కలిపి బ్యాగులు నింపాలని, బెడ్స్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, గ్రామపంచాయతీ భవనం పనులను పరిశీలించారు. గేర్రెగూడెం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. రైతులతో చర్చించి భూమి సమస్యలను పరిష్కరించుకోవాలని గ్రామ సర్పంచ్ సమక్షంలో గ్రామ పెద్దలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజన్న, ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శులు శివాని, పోషాలు, రాజేశ్వర్, టీఏ రాజేష్, ఎఫ్‌ఏ ముక్తాశ్వర్, వినేష్ తదితరులు పాల్గొన్నారు.