18 April, 2026 | 10:44 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

అతిగా ఆలోచించకండి

25-05-2025 12:00 AM

బిజీ లైఫ్‌లో చాలామంది అతిగా ఆలోచించడం అంటే అవసరానికి మించి ఆలోచించడం అనే సమస్యతో ఇబ్బంది పడుతు న్నారు. ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం, భవిష్యత్తు గురించి చింతించడం లేదా పాత సంఘటనల గురించి కలత చెందడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్రలేకపోవడం వంటి సమస్యలు పెరుగుతాయి. అతిగా ఆలోచించకుండా ఉండాలంటే కింది టిప్స్ పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణం భవిష్యత్తు గురించి చింతించడం లేదా గతాన్ని పదే పదే గుర్తుంచుకోవడం. వర్తమానంలో జీవించే అలవాటు ఈ సమస్యను తగ్గించగలదు. వర్తమానంపై దృష్టి పెట్టడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనల భారం తగ్గుతుంది. ప్రతిరోజూ ఐదు, పది నిమిషాలు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ఖాళీ సమయంలో ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం అనేది ఒత్తిడికి ప్రధాన కారణం. సోషల్ మీడియాలో ఇతరులతో మీ జీవితాన్ని పోల్చడం లేదా ప్రతికూల వార్తలు చదవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. రోజుకు 1 గంటలు మీ కోసం సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో మీకు ఇష్టమైన పని చేయాలి. సంగీతం వినడం, పుస్తకం చదవడం లేదా తోటపని చేయడం వంటివి చేయండి.

ఒకేసారి చాలా ఆలోచనలు మనసులోకి వచ్చినప్పుడు వాటిని కాగితంపై రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా డైరీలో రాయడం వల్ల ఆలోచనలు, భయాలు దూరమై.. మనసు తేలికవుతుంది. 

మీ మనసు భారంగా అనిపించినప్పుడు మీ ఆలోచనలను మీ ఫ్రెండ్‌తో లేదా కుటుంబ సభ్యునితో పంచుకోవాలి.