25-05-2025 12:00:00 AM
నువ్వులు, బెల్లం శరీరంలో వేడిని, శక్తిని పెంచుతాయి. అలాగే ఈ రెండింటిలో ప్రోటీన్, కాల్షియం, బి కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసే ఉండలను తింటే మన శరీరానికి కావాల్సిన వేడి అందుతుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అలాగే బెల్లం, నువ్వులను కలిపి లడ్డూలుగా చేసి తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి రోగాలు, ఇన్‌ఫెక్షన్లు, జీర్ణ సమస్యల ముప్పు తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వృద్ధాప్య లక్షణాలు, ముఖంపై ముడతల ముప్పు తగ్గుతుంది. నువ్వులలో ఉన్న ఫైబర్ శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
నువ్వులు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌తో నిండి ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. నువ్వులలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు వల్ల జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.