10-11-2025 12:00:00 AM
-మానసిక ఆరోగ్యంపై అవగాహన,
-బాలల సంక్షేమంపై దృష్టి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీ టీఎంటీ హైదరాబాద్ 10కే రన్ నిర్వహించారు. మైండ్ ఓవర్ మైల్స్ అనే స్ఫూర్తిదాయకమైన థీమ్‌తో మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమంపై అవగాహన పెంచడానికి వందలాది మంది పాల్గొన్నారు. శ్రీ టీఎంటీ సంస్థ కిమ్స్ హాస్పిటల్స్‌ను వైద్య భాగస్వామిగా చేర్చుకుని ఈ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.
మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్-చైర్మన్ డా. సిహెచ్. ప్రీతిరెడ్డి పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సి పల్ సెక్రటరీ నీరజ ఆడిదం, ప్రపంచ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీ త అనూప్ కుమార్ యమ, దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ (శ్రీ టీఎంటీ) నుంచి ప్రకా ష్ గోయెంకా (మేనేజింగ్ డైరెక్టర్), నీరజ్ గోయెంకా (డైరెక్టర్), సిద్ధార్థ గోయెంకా (డైరెక్టర్), కరణ్ గోయెంకా (సీఈవో) ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉదయం 5:30 గంటలకే మొదలైం ది.
ముఖ్య అతిథులు మానసిక ఆరోగ్యం మరియు సంక్షేమంపై స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఉల్లా సభరితమైన జుంబా సెషన్ 10కే, 5కే రన్లకు ఊపందుకునేలా చేసింది. 16 సంవత్సరాల కేటగిరీలో, నీరజ్ గోయెంకా, రాఘవ్, సుశీల్ కుమార్ గుప్తా (స్కై వేద) మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. 24 సంవత్సరాల గ్రూప్‌లో విజేతలుగా వినీలా కొండపల్లి, డా. విపిన్, పి. సుధారాణి నిలిచారు. 36 సంవత్సరాల కేటగిరీలో యూనియన్ బ్యాంక్ నుండి భాస్కర్ విజేతగా నిలిచారు. 45 సంవత్సరాల గ్రూప్‌లో రాజు అనే వ్యక్తి మొదటి బహుమతిని గెలుచుకున్నారు.