18-11-2025 12:59:09 AM
-ఫ్లై ఓవర్ పనుల్లో జాప్యంపై ఎంపీ ఈటల సీరియస్
మేడ్చల్, నవంబర్ 17 (విజయ క్రాంతి): కొంపల్లిలో ఫ్లై ఓవర్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కొంపల్లి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. 2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన పనులు ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలేదు.
దీంతో ఈటల కాంట్రాక్టర్, నేషనల్ హైవే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫ్లైఓవర్ పనుల్లో జాప్యం వల్ల ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రాణాలు పోతున్న పట్టించుకోరా’? పని చేతకాని కంపెనీ ఎందు కు టెండర్ వేసింది, అధికారులు ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్లను జైలులో పెట్టిం చాలి, పనులు ఇలాగే జాప్యం చేస్తే ప్రజల చేతిలో దెబ్బలు తింటారని హెచ్చరించారు.