18-11-2025 12:59:35 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సర్కారు అండగా నిలవాలని కోరారు.