02-12-2025 07:15:07 PM
కోదాడ: కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిజేపీ, జనసేన, పార్టీలు బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దొంతగాని అప్పారావు మంగళవారం కాపుగల్లులో భారీ జన సమూహంతో ఊరేగింపుగా గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దొంతగాని అప్పారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని రాష్టం లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
అనంతరం ఊరేగింపుగా వస్తు ప్రచారం నిర్వహించారు. కాపుగల్లు కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గంటా శ్రీనివాసరావు, బాడిషా వెంకట్, జిల్లా బోసు బాబు, ఓర్సు గోపి , కటికాల సతీష్, గుండెబోయిన రామకృష్ణ, బిజెపి కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి కనగాల నారాయణ, బిజెపి మునగాల మండల మాజీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, దేవరశెట్టి సత్యనారాయణ, గణేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కిరణ్, తోడేటి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.