calender_icon.png 9 June, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరపత్రాలు, ఫ్లెక్సీలతో బడిబాట ఇంటింటి ప్రచారం

08-06-2025 10:42:37 PM

కోదాడ: జడ్పీ బాయ్స్ హై స్కూల్ కోదాడ, ఉపాధ్యాయ బృందం ఆదివారం పట్టణం వీధులలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రం ప్లెక్సీలతో "బడిబాట 3వ రోజు" కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడమే లక్ష్యంగా, ప్రభుత్వ బడిలో విద్యార్థులకు అందిస్తున్న ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు, రాగి జావ, మెడికల్ చెకప్, విద్యార్థుల ప్రగతి సమీక్ష సమావేశం, కోకరికులం కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఇ శ్రీనివాస్ రెడ్డి, డి. లింగయ్య, ఎస్. బ్రహ్మానందం, ఎం. జానకిరామ్, ఎం. చిన్నప్ప, కె. రవి పాల్గొన్నారు.