02-02-2026 05:11:00 PM
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు,(విజయక్రాంతి): ప్రభుత్వం మనదే ఉంది. అందరం కలిసికట్టుగా పట్టణం అభివృద్ధి చేసుకుందాం అని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోమవారం సాయిపూర్ ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పది సంవత్సరాల కాలంలో పట్టణం అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 18 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.