28 April, 2026 | 3:00 AM

దోస్త్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

28-04-2026 01:13 AM

లక్షెట్టిపేట, ఏప్రిల్ 27: దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సేవలు తెలంగాణ) హెల్ప్ డెస్క్‌ను లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చెసుకోవడానీకి ఉపయోగించుకోవాలని కోరారు. హెల్ప్ డెస్క్ ఇంచార్జిగా చరిత్ర అధ్యాపకులు సల్ల శ్రీనివాస్  వ్యవహరించనున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జాడి శంకరయ్య, పి. స్వామి, టి.సతీష్, ఎం. మహేష్ కుమార్ పాల్గొన్నారు.