అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
నస్పూర్, ఏప్రిల్ 27 : పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆఫ్టర్ కేర్ కార్యక్రమానికి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కలిసి హాజరై మాట్లాడారు. బాలల భద్రత,రక్షణ వారాన్ని మే 2 వరకు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, కుల దృవీకరణ, బ్యాంక్ ఖాతా, జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలు అందించడం జరిగిందన్నారు.






