28 April, 2026 | 3:01 AM

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి

28-04-2026 01:11 AM

నిర్మల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): వచ్చే నెల ౩న జరగనున్న టిజీఆర్జెసి సెట్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఉమ్మడి జిల్లా జిల్లా కన్వీనర్ సోఫినగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కొరకు టీజీఆర్‌జెసి  కళాశాలలో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించే పరీక్షకు మొత్తం 76126 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్ష సమయానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మే 3న ఈ పరీక్ష ఉంటుందని తెలిపారు