13 July, 2026 | 10:44 AM

నేడు దోస్త్ నోటిఫికేషన్

03-05-2024 12:14 AM

హైదరాబాద్, మే 02 (విజయక్రాంతి): డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ నేడు విడుదల కా నుంది. దోస్త్ ద్వారా తెలంగాణలోని అ న్ని యూనివర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్‌లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటు ంది. దోస్త్ నోటిఫికేషన్‌ను మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తారు.