సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
03-05-2024 12:15 AM
ఇంటర్ బోర్డు ప్రకటన
హైదరాబాద్,మే02(విజయక్రాంతి): ఇంటర్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగించింది. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షెడ్యూ ల్ ప్రకారం గురువారం తో గడువు ముగిసింది. దీనికి మరో రెండు రోజులు పెంచుతూ ఈనెల 4వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 3 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరగున్నాయి. ఉదయం, మధ్యా హ్నం రెండు సెషన్‌లలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.






